అక్షరటుడే, కామారెడ్డి: వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడి తెలంగాణ ప్రజల తెగువను ప్రపంచానికి చాటిన వీర వనిత చాకలి ఐలమ్మ అని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ వెంకటయ్య అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్ ఆవరణలో మంగళవారం ఐలమ్మ వర్ధంతి బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఐలమ్మ చిత్రపటానికి ఆయన పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయన మాట్లాడుతూ ఐలమ్మ ధైర్యసాహసాలు, చైతన్యం నేటి తరానికి స్ఫూర్తిదాయకం అన్నారు. కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ మాట్లాడుతూ మహిళా చైతన్యానికి ప్రతీకగా ఐలమ్మ నిలిచారని చెప్పారు. కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ దయానంద్, వసతి గృహం సంక్షేమ అధికారులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.