అక్షరటుడే, ఎల్లారెడ్డి: Chalo Basthi abhiyaan | ఎల్లారెడ్డి పట్టణంలో బీజేపీ ఆధ్వర్యంలో గాంధీ చౌక్ వీధిలో ‘చలో బస్తీ అభియాన్’ (Chalo Basti Abhiyan) కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా బస్తీవాసులకు కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి వివరించారు.
అనంతరం పథకాల ద్వారా లబ్ధి పొందినవారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. మోదీ పాలన పట్ల ప్రజలు ఎంతో సంతృప్తిగా ఉన్నారని నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకుడు బత్తిని దేవేందర్, మండలాధ్యక్షుడు నర్సింలు, పట్టణ అధ్యక్షుడు రాజేష్, మండల ప్రధాన కార్యదర్శి నరేష్, BJYM మండల అధ్యక్షుడు మహేందర్, పట్టణ అధ్యక్షుడు శంకర్, మాజీ ఎంపీపీ నక్క గంగాధర్, మాజీ మండల అధ్యక్షుడు ఎస్ఎన్ రెడ్డి, మాజీ పట్టణ అధ్యక్షుడు సతీష్, మండల ఉపాధ్యక్షుడు రాములు, వెంకటరెడ్డి, ఓబీసీ మండలాధ్యక్షుడు సాయిలు, కిసాన్ సెల్ అధ్యక్షుడు సంగారెడ్డి, ఆంజనేయులు, రావుల కిష్టయ్య, సుజాత తదితరులు పాల్గొన్నారు.