అక్షరటుడే, వెబ్‌డెస్క్ Champions Trophy : ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ సొంతం చేసుకోవడం ఒక చారిత్రాత్మక ఘట్టం.
టీమిండియా ఈ ఘనత మూడుసార్లు సాధించి, అరుదైన రికార్డును సొంతం చేసుకుంది.ఈ సందర్భంగా క్రికెట్ అభిమానులు నెట్టింట పండుగ చేసుకుంటున్నారు. ఐసీసీ ఛాంపియన్షిప్ టోర్నీ తుదిపోరు, ఆ తదుపరి పరిణామాల అరుదైన చిత్రాలను సామాజిక మాధ్యమాల పంచుకుంటూ తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.
వికెట్లతో రోహిత్, కోహ్లీ ఆడిన కోలాటానికి రోకోలాటం అని, రోకో హాశ్టాగ్ అని జత చేస్తూ వైరల్ చేస్తున్నారు.
విజయంతో ఎగిరి గంతేసిన మన క్రీడాకారుల ఫొటోలకు ఓపెన్ గంగ్నమ్ స్టైల్ అంటూ హాశ్టాగ్ జత చేస్తున్నారు.
ఐసీసీ ఛాంపియన్షిట్ ట్రోఫీని ముద్దాడిన భారత్ అంటూ మరికొందరు ట్రోల్ చేస్తున్నారు.
ఇక జట్టు సారథి రోహిత్ శర్మ మైదానంలో కింద కూర్చోని, ట్రోఫీని తన పక్కనే నిలబెట్టి దిగిన స్టిల్ అయితే అందరి స్టేటస్‌లో దర్శనం ఇస్తోంది.