Chandrababu : కాపుల‌కి చంద్ర‌బాబు పెద్ద పీట వేయ‌బోతున్నారా.. వంగ‌వీటి రాధాకి కీల‌క ప‌దవి ఇచ్చే ఛాన్స్!

Chandrababu : కాపుల‌కి చంద్ర‌బాబు పెద్ద పీట వేయ‌బోతున్నారా.. వంగ‌వీటి రాధాకి కీల‌క ప‌దవి ఇచ్చే ఛాన్స్
Chandrababu : కాపుల‌కి చంద్ర‌బాబు పెద్ద పీట వేయ‌బోతున్నారా.. వంగ‌వీటి రాధాకి కీల‌క ప‌దవి ఇచ్చే ఛాన్స్

అక్షరటుడే, వెబ్ డెస్క్: Chandrababu : కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక రాష్ట్రంలో అనేక మార్పులు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. ఇటీవలే సోమువీర్రాజు, కొణిదెల నాగబాబు (Naga babu)కు ఎమ్మెల్సీ పదవులు ఇచ్చిన కూట‌మి ప్ర‌భుత్వం ఇప్పుడు వంగ‌వీటి రాధాకి (Vangaveeti Radhaa) కూడా ఓ ప‌ద‌వి ఇవ్వాల‌ని భావిస్తుంద‌ట‌. అంటే కాపు వ‌ర్గానికి ద‌గ్గ‌ర‌య్యేలా చంద్ర‌బాబు పావులు క‌దుపుతున్న‌ట్టు అర్ధ‌మ‌వుతుంది. తాజాగా (Chandrababu) సీఎం చంద్రబాబుతో (Vangaveeti Radhaa) వంగవీటి రాధా బుధవారం అమరావతిలో భేటీ అయ్యారు. ఇటీవల ఎమ్మెల్సీల జాబితాలో వంగవీటి రాధా పేరు లేక‌పోవ‌డం, ఆయ‌న‌ అనుచర వర్గం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబును వంగవీటి రాధా కలవడం ప్రాధాన్యత సంతరించుకొంది.

Advertisement
Advertisement

Chandrababu : చంద్ర‌బాబు ప్లాన్ ఏంటి?

2019 ఎన్నికల సమయంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్‌తో (YSRCP chief YS Jagan) రాధా విబేధించారు. దీంతో ఆయన (TDP)టీడీపీలో చేరారు. 2019, 2024 ఎన్నికల్లో టీడీపీ కోసం విస్తృతంగా ప్రచారం చేశారు. అయితే ఆయన టిక్కెట్ అడగలేదు. ఎక్కడా పోటీ చేయలేదు. ఎన్నికల ప్రచారంలో వంగవీటి రాధాకృష్ణకు మంచి పదవి ఇచ్చి గౌరవిస్తామని చంద్రబాబు (Chandrababu) హామీ ఇచ్చారు. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఐదు స్థానాల్లో ఒకటి రాధాకు కేటాయిస్తారని ప్రచారం జరిగింది. కానీ ఆ పదవి ఆయనకు కేటాయించలేదు. దీంతో ఆయన వర్గం తీవ్ర కలత చెందినట్లు సమాచారం.

దాదాపు 20 నిమిషాల పాటు రాధాతో చంద్రబాబు మాట్లాడారు. అంతేకాదు త్వరలో వంగవీటి రాధాకు (Vangaveeti Radhaa) చంద్రబాబు కీలక పదవి ఇవ్వనున్నారని సమాచారం. ఆ మేరకు రాధాతో చంద్రబాబు చెప్పినట్లు తెలుస్తోంది. (Chandrababu) చంద్రబాబుతో జరిగిన చర్చ గుడ్ మూడ్​తో ఉందని తన సన్నిహితులతో రాధా చెప్పినట్లు తెలుస్తోంది. చూస్తుంటే వంగ‌వీటి రాధాకి త్వ‌ర‌లో (Chandrababu) చంద్ర‌బాబు ఓ గుడ్ న్యూస్ అయితే అందిస్తాడ‌ని తెలుస్తోంది.

Advertisement