Air India Flight : ఎయిర్ ఇండియా విమానానికి ఊహించని అడ్డంకి.. ఆకాశంలో ఉండగానే?

Air India Flight : ఎయిర్ ఇండియా విమానానికి ఊహించని అడ్డంకి.. ఆకాశంలో ఉండగానే?
Air India Flight : ఎయిర్ ఇండియా విమానానికి ఊహించని అడ్డంకి.. ఆకాశంలో ఉండగానే?
Advertisement

అక్ష‌ర‌టుడే, వెబ్‌డెస్క్‌ Air India Flight : బస్సు, ట్రెయిన్ ప్రయాణం అంటే పెద్దగా టెన్షన్ ఉండదు కానీ.. విమాన ప్రయాణం అంటనే ప్రయాణికుల లోపల ఏదో తెలియని వణుకు వస్తుంది. లోపల భయపడుతూనే విమానాలు ఎక్కుతుంటారు ప్రయాణికులు. నిజానికి విమానాల్లో కొన్ని రకాల సమస్యలు ఆకాశంలో ఉన్నప్పుడు తలెత్తుతుంటాయి. అటువంటి సమయాల్లో పైలెట్స్ ఎంత చాకచక్యంగా వ్యవహరిస్తేనే ప్రయాణికుల ప్రాణాలు నిలబడతాయి. విమానాలు ఆకాశంలో ఉండగా సమస్యలు తలెత్తి ఎన్నో విమానాలు కూలిపోయి ఎందరో ప్రయాణికుల ప్రాణాలు గాల్లో కలిసిపోయిన ఘటనలు ఎన్నో చూశాం. కానీ.. తాజాగా జరిగిన ఘటన విచిత్రమైనది.

యూఎస్ నుంచి ఇండియాకు బయలుదేరిన ఒక ఎయిర్ ఇండియా విమానానికి ఊహించని అడ్డంకి ఎదురైంది. ఆ విమానంలో ప్రయాణిస్తున్న కొందరు ప్రయాణికులు మరుగు దొడ్లకు వెళ్లక అవి పనిచేయలేదట. అవి సరిగ్గా పని చేయకపోవడంతో వాళ్లు తీవ్ర అసహనానికి గురయ్యారు. వెంటనే ఈ విషయాన్ని విమాన సిబ్బందికి తెలియజేసినా వాళ్లు పట్టించుకోలేదు.

Air India Flight : సిబ్బందిపై ప్రయాణికుల ఆగ్రహం

మరుగుదొడ్లు సరిగ్గా పనిచేయడం లేదని చెప్పినా సిబ్బంది పట్టించుకోకపోవడంతో ప్రయాణికులంతా ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఏం చేయాలో తెలియక ఎయిర్ ఇండియా ఫైలెట్ తిరిగి ఆ విమానాన్ని వెనక్కి తిప్పి మళ్లీ యూఎస్ కు తీసుకురావాల్సి వచ్చింది. మార్గమధ్యంలోనే యూటర్న్ తీసుకొని విమానం వెనక్కి వెళ్లాల్సి రావడంతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ఈ ఘటనపై ఎయిర్ ఇండియా అధికారులు కూడా స్పందించలేదు. కేవలం సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ఆకాశంలో ఉన్న విమానం తిరిగి మళ్లీ ప్రయాణికులు ఎక్కిన విమానాశ్రయానికే రావడం అనేది ఇదే మొదటి సారి కావచ్చు. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Advertisement