అక్షర టుడే, వెబ్ డెస్క్ ChatGPT : భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడికి ఆధార్ కార్డు (Aadhar card) ఉంటుంది. అలాగే పాన్ కార్డు (PAN card) కూడా బ్యాంక్ అకౌంట్ (Bank account) ఉన్న ప్రతి ఒక్కరు తీసుకుంటారు. ఈ రెండు డాక్యుమెంట్లు ఇండియాకి చెందిన పౌరులు అని చెప్పడానికి సాక్ష్యాలు. కానీ, వీటిని డూప్లికేట్ చేసి అడ్రస్, నెంబర్ లాంటివి తప్పుడు వివరాలు ఇచ్చి కొందరు ఫేక్ ఐడీలు క్రియేట్ చేస్తుంటారు. వేరే దేశం నుంచి అక్రమంగా వచ్చిన వాళ్లకు, ఇదే దేశంలో ఒక్కరే రకరకాల పేర్లతో ఫేక్ ఐడీలు క్రియేట్ చేస్తుంటారు. అత్యాధునిక సాఫ్ట్ వేర్ సాయంతో కొందరు సైబర్ క్రిమినల్స్ (Cybercriminals) కూడా తప్పుడు వివరాలతో ఫేక్ ఆధార్ కార్డు, Fake Aadhar card, fake PAN card ఫేక్ పాన్ కార్డు క్రియేట్ చేస్తుంటారు.
సరే వాళ్లంటే సైబర్ నేరాల (Cybercrime) కోసం చేస్తుంటారు అనుకోవచ్చు. కానీ, ఈ మధ్య బాగా పాపులర్ అయిన ఏఐ టూల్ చాట్ జీపీటీ (ChatGPT) కూడా ఫేక్ ఆధార్, Fake Aadhaar, PAN card పాన్ కార్డులను క్రియేట్ చేస్తోంది. నమ్మశక్యంగా లేదు కదా. నిజానికి ఏఐ ఎలాంటి ప్రాంప్ట్ ఇస్తే అలాంటి సమాధానాన్ని ఇస్తుంది. అందుకే కొందరు సైబర్ నేరగాళ్లు ఇలాంటి ఏఐ టెక్నాలజీలను ఉపయోగించుకొని, (ChatGPT) చాట్ జీపీటీ లో ఆధార్ కార్డు (Aadhar card) క్రియేట్ చేయాలని, పేరు, అడ్రస్, పుట్టిన తేదీ లాంటి వివరాలు ఇస్తే సేమ్ టు సేమ్ ప్రస్తుతం ఒరిజినల్ ఆధార్ కార్డు (Aadhar card) ఎలా ఉందో.. అలాగే ఆధార్ కార్డును క్రియేట్ చేసి ఇచ్చేస్తోంది చాట్ జీపీటీ.
ChatGPT : ఏఐని కట్టడి చేయకపోతే మానవ మనుగడ కష్టమే
ఏఐని కట్టడి చేయకపోతే, లిమిట్ చేయకపోతే మానవ మనుగడ కష్టమే. కొన్ని రకాల వర్క్స్ కోసమే ఏఐని వాడుకోవాలి కానీ, ఇలా ఏఐని లిమిట్ దాటి వాడుకుంటే ఇలాగే ఉంటుంది. అది సైబర్ నేరగాళ్లకు (Cyber criminals) మంచి చాన్స్ అవుతుంది.. అని నెటిజన్లు మండిపడుతున్నారు. ఇది భారతదేశ భద్రతకే పెద్ద ప్రమాదాన్ని తీసుకొస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చూడాలి మరి, ఏఐ టెక్నాలజీ ఇంకెన్నీ ఇబ్బందులు తీసుకొస్తుందో.