అక్షరటుడే, ఇందూరు: ప్రతి విద్యాలయంలో భగవద్గీత బోధన తప్పనిసరి చేయాలని ఛత్రపతి శివాజీ మహారాజ్ సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు లక్ష్మణరావు డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని సూర్యనగర్లో గల ఆదిత్య పాఠశాలలో బుధవారం భగవద్గీత జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇంటింటా భగవద్గీతను పాటించాలన్నారు. గీత సారం ఆకలింపు చేసుకుంటే జీవితంలో బాధలు ఉండవని పేర్కొన్నారు.