Chaava Movie | తెలుగులో విడుదల కానున్న ‘ఛావా’

Chava Movie | తెలుగులో విడుదల కానున్న ‘ఛావా’
Chava Movie | తెలుగులో విడుదల కానున్న ‘ఛావా’
Advertisement

అక్షరటుడే, వెబ్​డెస్క్​ : Chaava Movie |ఛత్రపతి శివాజీ తనయుడు శంభాజీ మహరాజ్​ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ‘ఛావా’ బాలీవుడ్​లో బంపర్​ హిట్​ అయిన విషయం తెలిసిందే. విక్కీ కౌశల్​, రష్మిక మందన జంటగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్​ వద్ద భారీగా వసూళ్లు రాబట్టింది. ఈ క్రమంలో మిగతా భాషాల్లోనూ సినిమాను విడుదల చేయాలని మేకర్స్​ భావించారు.

గీతా ఆర్ట్స్​ డిస్ట్రిబ్యూషన్​లో సినిమాను తెలుగులో డబ్​ చేశారు. శుక్రవారం తెలుగు వర్షన్​ ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగులో విడుదలైన ట్రైలర్​కు మంచి స్పందన వచ్చింది. దీంతో థియేటర్లలో కూడా భారీ స్పందన వస్తుందని మూవీ టీం ఆశిస్తోంది.

Advertisement