అక్షరటుడే, వెబ్ డెస్క్: యూనియన్ బ్యాంకు శివాజీ నగర్ బ్రాంచ్ కేంద్రంగా జరిగిన స్కాం అంశంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. మోసానికి పాల్పడిన మేనేజర్ అజయ్ పై నాలుగో టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. బ్యాంక్ మేనేజర్ మనీష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు నగర సీఐ వెల్లడించారు. రూ.5 కోట్ల స్కాం జరిగిన విషయాన్ని తొలుత అక్షరటుడే వెలుగులోకి తెచ్చింది. అనంతరం బాధితులంతా ఏకమై బ్యాంకు అధికారులను నిలదీశారు. అక్కడ న్యాయం జరుగకపోగా.. పోలీసులను ఆశ్రయించారు. ఆ తర్వాత అజయ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. తిరిగి బ్యాంకు అధికారులు మేనేజర్ అజయ్ చీటింగ్, ఫోర్జరిలకు పాల్పడినట్లు ఫిర్యాదు ఇవ్వగా మరో కేసు నమోదైంది. ఇకపై పోలీసులు కేసు దర్యాప్తులో వేగం పెంచనున్నారు. ఇంకోవైపు బ్యాంక్ లోనూ అంతర్గత ఆడిట్ కొనసాగుతోంది.