Pawan Kalyan : వామ్మో.. ఇదెక్క‌డి అరాచ‌కం .. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఫొటో చూపించే కోట్లు కాజేసిన కేటుగాళ్లు

Pawan Kalyan : వామ్మో.. ఇదెక్క‌డి అరాచ‌కం .. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఫొటో చూపించే కోట్లు కాజేసిన కేటుగాళ్లు
Pawan Kalyan : వామ్మో.. ఇదెక్క‌డి అరాచ‌కం .. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఫొటో చూపించే కోట్లు కాజేసిన కేటుగాళ్లు
Advertisement

అక్ష‌ర‌టుడే, వెబ్‌డెస్క్‌ Pawan Kalyan : ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. ఈ పేరుకి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. స్టార్ హీరోగా ఓ వెలుగు వెలిగిన ప‌వ‌న్ ఇప్పుడు రాజ‌కీయాలలోకి వ‌చ్చి అంద‌రి అటెన్ష‌న్ త‌న వైపుకి తిప్పుకున్నాడు. ప‌వ‌న్ పేరు చెబితే అభిమానులు ఇలా ఊగిపోతుంటారు. ఆయ‌న‌కి అభిమానులు క‌న్నా భ‌క్తులే ఎక్కువ‌. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇప్పుడు సినిమాలు చేయ‌క‌పోయిన కూడా ఇప్ప‌టికీ ఫ్యాన్ ఫాలోయింగ్ త‌గ్గ‌లేదు. ఆయ‌న డిప్యూటీ సీఎం కాక‌ముందుకు క‌మిటైన కొన్ని సినిమాలు పెండింగ్‌లో ఉండ‌గా, వాటిని వీలైనంత త్వ‌ర‌గా పూర్తి చేయాల‌ని అనుకుంటున్నారు.

Pawan Kalyan : వెరైటీ మోసం..

అయితే ప‌వ‌న్ క‌ళ్యాణ్ క్రేజ్‌ని క్యాష్ చేసుకొని కొంద‌రు మోసాలు చేస్తున్నారు.ఇటీవ‌లి కాలంలో సైబ‌ర్ నేర‌గాళ్లు ఎలాంటి మోసాల‌కి పాల్ప‌డుతున్నారో మ‌నం చూస్తూనే ఉన్నాం. గిఫ్ట్ కార్డులు, వాట్సాప్ లింకులు వంటివి పంపించి ప్రజలను మోసం చేస్తూ భారీగానే డబ్బులు దోచుకుంటూ ఉన్నారు. ఇలాంటి వాటికి పోలీసులు చెక్ పెట్టిన కూడా కొత్త ఆలోచ‌న‌ల‌తో ప్ర‌జ‌ల‌ని మోసం చేస్తున్నారు. తాజాగా పవన్ కళ్యాణ్ సినిమా ప్రమోషన్స్ పేరుతో ఏకంగా 1.34 కోట్ల రూపాయలు ఒక ప్రైవేటు ఉద్యోగి నుంచి తీసుకొని మోసం చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. హైదరాబాద్ కి చెందిన ఒక ప్రైవేటు ఉద్యోగి తన స్నేహితులతో కలసి ఎక్కువగా గోవాకి వెళుతూ ఉండేవారట.. అయితే గత ఏడాది అక్టోబర్లో క్యాసినో కు వెళ్ళగా అక్కడ శ్రీలంకకు చెందిన వివేక్, ఉదయ్ రాజ్ వంటి వారు పరిచయమయ్యారట.

ఇది కూడా చ‌ద‌వండి :  Naga Babu : చిరంజీవి, ప‌వ‌న్‌కి నాగబాబు ఎంత అప్పు ఉన్నారో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..!

వారికి తాము కొత్త‌గా విడుద‌ల‌య్యే తెలుగు చిత్రాల‌ని ప్ర‌మోష‌న్స్ చేస్తాం అని అన్నారట‌. ఇక అదే నెల‌లో ఉదయ్ రాజ్ గచ్చిబౌలిలో ఒక హోటల్లో దిగి ఆ బాధితుడిని కలిసి ఓజీ సినిమా డైరెక్టర్ సుజిత్ తో కలిసి ఉన్న ఫోటోలను చూపిస్తూ నమ్మించారట.ఆ స‌మ‌యంలో తాము అమ‌ర‌న్ చిత్రానికి ప్రమోష‌న్స్ చేస్తే వారం రోజుల‌లోనే రూ.20 ల‌క్ష‌ల లాభాలు వచ్చాయంటూ ఆ వ్య‌క్తిని న‌మ్మించారు. ఇద్ద‌రి బ్యాంకు ఖాతాలు కూడా చూపించార‌ట‌. అలా అత‌డిని న‌మ్మించి రూ.25 ల‌క్ష‌ల రూపాయలు అతడి నుండి నొక్కేసారు. ఆ తర్వాత పుష్ప 2, గేమ్ ఛేంజర్ సినిమా ప్రమోషన్స్ పేరిట 76 లక్షలు.. మరొకసారి 58 లక్షలు తీసుకున్నారట. అయితే ఆ బాధితుడు తన ఆస్తితో పాటు తన భార్య నగలు అన్ని అప్పు చేసి సుమారుగా 1.34 కోట్ల రూపాయల వరకు చెల్లించారట. చివ‌రికి అతని ఫోన్ స్విచాఫ్ రావ‌డంతో మోస‌పోయిన‌ట్టుగా గ్ర‌హించాడు.

Advertisement