అక్షరటుడే, నిజామాబాద్‌రూరల్‌: మండలంలోని గుండారం, మల్కాపూర్‌ శివార్లలో చిరుత సంచరిస్తోంది. ఈ గ్రామాల సమీపంలో ప్రాణహిత చేవెళ్ల పనులు కొనసాగుతున్నాయి. అయితే కార్మికులు శుక్రవారం తెల్లవారు జామున వాహనంలో వెళ్తుండగా రోడ్డు పక్కన చిరుత కనిపించింది. ఈ విషయం చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు తెలియడంతో భయాందోళనకు గురవుతున్నారు. అటువైపుగా వెళ్లేందుకు జంకుతున్నారు.