అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: రసాయనాలు వాడి మక్కబెట్టిన పండ్లను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి హెచ్చరించారు. బుధవారం నగరంలోని ఫ్రూట్ మార్కెట్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వ్యాపారులు ప్రజలకు నాణ్యమైన పండ్లను మాత్రమే విక్రయించాలని సూచించారు. ఆయన వెంట కాంగ్రెస్ నేతలు మానాల మోహన్‌రెడ్డి, కేశవేణు, తాహెర్‌బిన్ హందాన్, గడుగు గంగాధర్, నగేశ్‌రెడ్డి, , గంగారెడ్డి ఉన్నారు.