అక్షరటుడే, ఇందూరు : మాలల ఐక్యతను చీల్చడానికి కుట్రలు జరుగుతున్నాయని చెన్నూరు ఎమ్మెల్యే డాక్టర్ వివేక్ అన్నారు. ఆదివారం నగరంలో మాలల ఆత్మగౌరవ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఐక్యత సాధించడానికి నాన్న స్ఫూర్తితో బయటకు వచ్చానన్నారు. రాష్ట్ర జనాభాలో మాలలు రెండో స్థానంలో ఉంటారన్నారు. కానీ 30 లక్షల మంది జనాభాను తక్కువ చేసి చూపిస్తున్నారన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తాను కీలక పాత్ర పోషించానని, ప్రజల ఆకాంక్షలను తెలపడానికే ఛానల్ ప్రారంభించానన్నారు. ఎస్సీ వర్గీకరణ పై సుప్రీంకోర్టు తీర్పు వచ్చాక మాల జాతిలో అభద్రతాభావం నెలకొందన్నారు. వర్గీకరణపై సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం సరైంది కాదని చెప్పానని తెలిపారు. ఏసీబీ దాడులు 90 శాతం మాల ఉద్యోగులపైనే జరుగుతున్నాయన్నారు. డిసెంబర్ 1న హైదరాబాద్ లో నిర్వహించనున్న సభను విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు చెన్నయ్య, అలుక కిషన్, విజయ్, స్వామిదాస్, దేవిదాస్, సర్వయ్య తదితరులు పాల్గొన్నారు.