బీఆర్‌ఎస్‌కు మరో ఎంపీ రాజీనామా!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: బీఆర్‌ఎస్‌కు మరో షాక్‌ తగిలింది. చేవెళ్ల ఎంపీ, బీఆర్‌ఎస్ నేత రంజిత్‌ రెడ్డి పార్టీకి ఆదివారం రాజీనామా చేశారు. ఇన్ని రోజుల పాటు చేవెళ్ల ప్రజలకు సేవ చేసేందుకు అవకాశం ఇచ్చినందుకు కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలుపుతూ తన రాజీనామా లేఖను సమర్పించారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. తిరిగి చేవెళ్ల నుంచి ఎంపీగా పోటీ చేయనున్నారు. ఇక్కడ కాంగ్రెస్ తరపున టికెట్ ఆశిస్తున్న పట్నం సునీత మహేందర్ రెడ్డికి మల్కాజ్ గిరి పార్లమెంట్ టికెట్ ఇస్తారని సమాచారం.

Advertisement
Advertisement
Advertisement