అక్షరటుడే, ఇందూరు: పార్టీ సభ్యత్వ నమోదులో తెలంగాణలో ఇందూరు మొదటి స్థానంలో ఉందని, చివరి వరకు ఇలాగే కొనసాగాలని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. మంగళవారం నగరంలోని నిఖిల్ సాయి హోటల్‌లో జిల్లా సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. ఇందూరు జిల్లాకు 2 లక్షల టార్గెట్ ఉందన్నారు. అంతకు మించి లక్ష్యాన్ని పూర్తి చేసేలా ప్రతీ కార్యకర్త పనిచేయాలని సూచించారు. బూత్ స్థాయిలో విధించిన లక్ష్యాన్ని చేరుకోవాలంటే బాధ్యతగా పనిచేయాలన్నారు. ఆర్ఎస్ఎస్‌కు రాజకీయాలకు సంబంధం లేదని చెప్పారు. వచ్చే సర్పంచ్ ఎన్నికల్లో 60 శాతం బీజేపీ అభ్యర్థులే గెలవాలని ఆకాంక్షించారు. ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి మాట్లాడుతూ.. పార్టీ సభ్యత్వం అంటే భరోసా అన్నారు. కార్యకర్తల బలంతోనే తాను గెలిచానని సభ్యత్వ నమోదులోనూ వారి బలంతో ముందుకెళ్తానన్నారు. అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా మాట్లాడుతూ… జిల్లాలో లక్ష్యాన్ని చేరుకుంటామన్నారు. అర్బన్ లో 50 వేల సభ్యత్వాన్ని నమోదు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. సమావేశంలో జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి, నాయకులు లోక భూపతిరెడ్డి, బద్దం లింగారెడ్డి, లక్ష్మీనారాయణ, న్యాలం రాజు, ఫ్లోర్ లీడర్ స్రవంతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.