అక్షరటుడే, వెబ్‌డెస్క్: కేంద్ర ఎన్నికల సంఘం నేడు సాయంత్రం 4.30 గంటలకు కీలక ప్రెస్‌మీట్ నిర్వహించనుంది. పార్లమెంట్ ఎన్నికల నోటికేఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే రాష్ట్రంలో ఎన్నికలు మొదటి విడతలో జరుగుతాయా లేదా రెండో విడతలోనా అనే ఉత్కంఠ నెలకొంది. అయితే ఇప్పటికే అన్ని ప్రధాన పార్టీలు ఎన్నికలకు సమాయత్తం అవుతున్నాయి. అభ్యర్థులను సైతం ప్రకటిస్తున్నాయి. ఒకవేళ సీఈసీ నోటిఫికేషన్ జారీ చేస్తే సత్వరమే ఎన్నికల కోడ్ అమల్లోకి రానుంది.