అక్షరటుడే, ఇందూరు: ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని ఈనెల 20 నుంచి అక్టోబర్ 18 వరకు చేపట్టాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి సూచించారు. అదనపు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ లోకేష్ కుమార్ తో కలిసి శనివారం కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. బూత్ లెవల్ అధికారులు ఇంటింటికి తిరుగుతూ.. ఓటరు జాబితా ప్రకారం పరిశీలన చేయాలని, కొత్త ఓటర్ల నమోదు, చిరునామా మార్పు తదితర వాటిని సవరించాలని ఆదేశించారు. అక్టోబర్ 29న ముసాయిదా ఓటరు జాబితా ప్రకటించడం జరుగుతుందన్నారు. వీటిపై అభ్యంతరాలను నవంబర్ 28 వరకు స్వీకరించాలన్నారు. జనవరి 6న తుది ఓటరు జాబితా ప్రచురిఇస్తామని తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్ అంకిత్, కలెక్టరేట్ ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు పవన్, సాత్విక్ తదితరులు పాల్గొన్నారు.