అక్షరటుడే, వెబ్ డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వ ఏడాది పాలనపై కేసీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేయగా.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. కేసీఆర్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ముందు అసెంబ్లీకి రావాలన్నారు. తాను కేసీఆర్ మాదిరి మాట తప్పేవాడిని కాదని పేర్కొన్నారు. ‘దమ్ముంటే అసెంబ్లీకి రా.. ఏబీసీడీ వర్గీకరణ చేద్దాం..’ అని సవాల్ విసిరారు. ధనిక రాష్ట్రమని అబద్ధాలు చెబుతూ అప్పుల రాష్ట్రంగా మార్చారని దుయ్యబట్టారు. రైతుబంధు ఇవ్వలేని పరిస్థితికి దిగజార్చారని మండిపడ్డారు. కేసీఆర్ ను ప్రజలు తిరస్కరించినా ఇంకా బుద్ధి రాలేదన్నారు. పాలమూరు ప్రాజెక్టులను ఎండబెట్టిన దుర్మార్గుడు కేసీఆర్ అని విమర్శించారు. కేసీఆర్ కాలం చెల్లిన వెయ్యి రూపాయల నోటు లాంటివారని, ఇక్కడ ఆయన కోసం ఎవరు ఎదురు చూడడం లేదని వ్యాఖ్యానించారు.
Advertisement
Advertisement