అక్షరటుడే, ఎల్లారెడ్డి: మెదక్ జిల్లా పాపన్నపేటలోని ఏడుపాయ దుర్గాభవాని అమ్మవారిని బుధవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు ముఖ్యమంత్రికి ఆశీర్వచనం అందించారు. అనంతరం జిల్లాకు సంబంధించి రూ.192 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ముఖ్యమంత్రి వెంట మంత్రులు దామోదర రాజనర్సింహ, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎంపీలు రఘునందన్ రావు, సురేష్ కుమార్ షెట్కర్, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యే రోహిత్ రావు, ఇతర ప్రజాప్రతినిధులు ఉన్నారు.
Advertisement
Advertisement