అక్షరటుడే, వెబ్డెస్క్: తెలంగాణలో ఇచ్చిన హామీల అమలుపై మహారాష్ట్రలో బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తోందని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన శనివారం ముంబయిలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. తెలంగాణలో ఆరు గ్యారంటీల అమలుపై ప్రధాని మోదీ దుష్ప్రచారం చేస్తున్నారని.. అది నిజం కాదని చెప్పడానికే ఇక్కడకు వచ్చానని తెలిపారు. ప్రణాళిక బద్ధంగా పథకాలను అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. కాగా.. ఇవాళ సాయంత్రం వరకు సీఎం రేవంత్ ముంబైలోనే ఉండనున్నారు. మహారాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలు తదితర అంశాలపై ముఖ్యమంత్రి చర్చించనున్నట్లు సమాచారం.