Pawan Kalyan : ఒకప్పుడు టాలీవుడ్ నెంబర్ వన్ హీరోగా ఉన్న Pawan Klayan పవన్ కళ్యాణ్ ప్రజలకి సేవ చేయాలని రాజకీయాలలోకి వచ్చారు. పదేళ్ల పాటు చాలా కష్టాలు అనుభవించారు. అతని నిజాయితీని మెచ్చిన ఏపీ ప్రజలు పవన్ కళ్యాణ్‌కి పట్టం కట్టారు. ఏకంగా డిప్యూటీ సీఎం పదవి దక్కించుకున్నారు.
అయితే ఇప్పుడు ఏపీలో ఎవరికి ఎలాంటి సమస్య వచ్చిన కూడా పవన్‌ని వేడుకుంటున్నారు. జగన్ ప్రభుత్వంలో రోడ్డు విస్తరణ, పునర్నిర్మాణం గురించి పట్టించుకోలేదంటూ పవన్ పదే పదే ఆగ్రహం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. కనీసం విద్యుత్ దీపాలు కూడా లేవు అని చెప్పారు.

Pawan Kalyan పవన్ కి రిక్వెస్ట్..
అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అందరి బాగోగులు పట్టించుకుంటుందని, అందరిని సొంత వాళ్ల మాదిరిగా భావించి ఎవరికి ఎలాంటి సమస్య వచ్చినా మేమున్నామని భరోసా ఇస్తుందని పవన్ చాలా సందర్భాలలో అన్నారు.
ఇటీవలి కాలంలో చాలా మంది గిరిజన గ్రామాల ప్రజలు కూడా పవన్ కళ్యాణ్‌కి తమ ఆవేదన తెలియజేస్తున్నారు. తాజాగా అనకాపల్లి జిల్లా దేవరపల్లి మండలం వీరభద్రపేట గ్రామానికి రోడ్డు లేక, సకాలంలో చికిత్స అందక ముగ్గురు చిన్నారులు మృతిచెందారు. ఈ ఘటనకు సంబంధించి, గ్రామస్తులు మరియు చిన్నారులు మోకాళ్లపై కూర్చుని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను వారి గ్రామానికి రోడ్డు వేయాలని మనవి చేశారు.
మోకాళ్లపై కూర్చుని చేతులు ఎత్తి దండం పెట్టి పవన్ కళ్యాణ్ ను వేడుకున్న గిరిజనులని చూసి ప్రతి ఒక్కరూ చలించిపోతున్నారు. నెటిజన్స్ సైతం ఆ చిన్నారుల బాధని చూసి అయిన వీలైనంత త్వరగా ఆ గ్రామ ప్రజలకి తగిన రోడ్లు వేయాలని, వసతులు కల్పించాలని కోరుతున్నారు. మరి దీనిపై పవన్ కళ్యాణ్ ఏమైన స్పందిస్తాడా అన్నది చూడాలి. ఇక పవన్ కళ్యాణ్ ఇప్పుడు వీలున్నప్పుడల్లా సినిమాలు చేస్తూనే మరోవైపు ప్రజల సమస్యలపై పోరాటం చేస్తున్న విషయం విదితమే.
కళ్యాణ్ బాబు.. మీకో దండం మాకు రోడ్డు వేయించండి
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు చిన్నారులు, గిరిజన గ్రామస్తుల విన్నపం
అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలం చింతలపూడి పంచాయితీ శివారు వీరభద్రపేటకు రోడ్డు సౌకర్యం కల్పించాలని ఆదివాసీల నిరసన
మోకాళ్లపై కూర్చుని చేతులు ఎత్తి దండం పెట్టి… pic.twitter.com/n4w6kZiXPl
— BIG TV Breaking News (@bigtvtelugu) March 3, 2025