Nizamabad | కిడ్నాపైన చిన్నారి ఆచూకీ లభ్యం

Nizamabad | కిడ్నాపైన చిన్నారి ఆచూకీ లభ్యం
Nizamabad | కిడ్నాపైన చిన్నారి ఆచూకీ లభ్యం

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ : Nizamabad | నగరంలో మూడు రోజుల క్రితం అపహరణకు గురైన చిన్నారి ఆచూకీని పోలీసులు కనుగొన్నారు. వన్ టౌన్(One Town)​ పరిధిలో రోడ్డు పక్కన ఓ కుటుంబం పిల్లలతో నిద్రిస్తుండగా రమ్య అనే మూడేళ్ల చిన్నారిని దుండగుడు ఎత్తుకెళ్లాడు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు నాలుగు బృందాలుగా ఏర్పడి నిందితుడి కోసం గాలించారు. ఈ క్రమంలో నస్రుల్లాబాద్(Nasrullabad)​ మండలం మిర్జాపూర్​ గ్రామానికి చెందిన గైక్వాడ్​ బాలాజీ చిన్నారిని కిడ్నాప్​ చేసినట్లు గుర్తించారు. నిందితుడి ఇంట్లో చిన్నారిని కనుగోని బుధవారం రాత్రి నగరానికి తీసుకొచ్చారు. బాలాజీ పరారీలో ఉండగా అతడి సోదరుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

Advertisement
Advertisement
Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  Online Betting | బెట్టింగ్​ నిర్వాహకుడి అరెస్ట్​