అక్షరటుడే, బాన్సువాడ: నస్రుల్లాబాద్ మండలం బొప్పస్ పల్లి తండాకు చెందిన చిమ్యనాయక్ పిడుగుపాటు బారినపడ్డాడు. శనివారం పశువులను మేపడానికి అటవీ ప్రాంతానికి వెళ్లగా భారీ వర్షం పడుతున్న సమయంలో పిడుగు పడి తీవ్ర గాయాలయ్యాయి. 108 అంబులెన్స్ కు ఫోన్ చేయడంతో వారు వెంటనే వచ్చి బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం చిమ్యనాయక్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

Advertisement
Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  Thunderstorm | పిడుగుపాటుకు 40 గొర్రెలు మృతి