China Vs America : యూఎస్ టారిఫ్స్‌కి మేము భయపడం.. దీటైన జవాబిచ్చిన చైనా

China Vs America : యూఎస్ టారిఫ్స్‌కి మేము భయపడం.. దీటైన జవాబిచ్చిన చైనా
China Vs America : యూఎస్ టారిఫ్స్‌కి మేము భయపడం.. దీటైన జవాబిచ్చిన చైనా

అక్షర టుడే, వెబ్ డెస్క్ China Vs America : ప్రస్తుతం యూఎస్, చైనా (China Vs America) మధ్య ట్రేడ్ వార్ నడుస్తోంది. ఇలాంటి వార్ ను మనం ఇప్పటి వరకు చూసి ఉండం. నిజానికి ఈ వార్ ను యూఎస్.. దాదాపు అన్ని దేశాలతో పెట్టుకునేందుకు సిద్ధమైంది. దాదాపు అన్ని దేశాలపై ప్రతీకార సుంకాన్ని యూఎస్ (America) విధించింది. కానీ, అన్ని దేశాలు ప్రతీకార సుంకాన్ని తగ్గించాలని యూఎస్ ని సంప్రదించాయి. దీంతో యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ కాస్త కూల్ అయ్యారు. అన్ని దేశాలు యూఎస్ ను సంప్రదించాయి కానీ, చైనా (China) మాత్రం సంప్రదించలేదు.

Advertisement

యూఎస్ పై (America) విధిస్తున్న సుంకాన్ని ఇంకాస్త పెంచింది. ఇలా ఒక దేశం మీద మరొకరు పెంచుకుంటూ వెళ్లిపోయారు. చివరకు చైనా మీద యూఎస్ 145 శాతం టారిఫ్స్ విధించింది. చైనా (China) నుంచి దిగుమతి చేసుకునే అన్ని వస్తువుల మీద 145 శాతం టారిఫ్స్ విధించింది. అయినా కూడా చైనా (China) మాత్రం యూఎస్ తో సంప్రదింపులు జరపడం లేదు. ఇతర దేశాలను సంప్రదించడం మొదలుపెట్టింది. తమతో కలిసి నడవాలని భారత్ ను కూడా చైనా (China) అభ్యర్థించింది. చివరకు యురోపియన్ యూనియన్ తో చైనా చేతులు కలిపి యూఎస్ ఆగడాలకు చెక్ పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

ఇది కూడా చ‌ద‌వండి :  immigration policy | యూఎస్​లో 30 రోజులకు పైగా ఉన్నారా.. అక్కడి ప్రభుత్వం వద్ద వివరాలు నమోదు చేసుకోవాల్సిందే..!

China Vs America : అంతర్జాతీయ బాధ్యతలను చైనా, యూరప్ కలిసే నిర్వర్తించాలన్న ప్రెసిడెంట్

చైనా ప్రెసిడెంట్ గ్జీ జిన్ పింగ్, యురోపియన్ యూనియన్ ను సంప్రదించిన అనంతరం మాట్లాడుతూ చైనా, యూరప్ రెండు కలిసి అంతర్జాతీయ బాధ్యతలను నిర్వర్తించుకోవాలన్నారు. దేశాన్ని ఇబ్బందుల్లోకి నెట్టి ట్రేడ్ వార్ కి తెర లేపిన యూఎస్ కు తగిన బుద్ధి చెప్పాలని జిన్ పింగ్ పిలుపునిచ్చారు. ఇలాంటి చర్యలు ఆ దేశానికి అస్సలు మంచిది కాదు. అంతర్జాతీయంగా సంబంధాలు తెగిపోయేలా చేయొద్దన్నారు.
ఈ సందర్భంగా స్పందించిన స్పానిష్ ప్రధాని ట్రేడ్ విషయంలో సృష్టిస్తున్న సమస్యలు ఈయూకి, బీజింగ్ కి మధ్య ఉన్న సంబంధాలను చెడగొట్టకూడదన్నారు. స్పెయిన్, యూరప్ కి చైనా వల్ల ట్రేడ్ కొరత ఉన్నప్పటికీ యూఎస్, చైనా (China) మధ్య నడుస్తున్న ట్రేడ్ వార్ వల్ల చైనా, ఈయూ మధ్య ఉన్న ట్రేడ్ సంబంధాలను తెంచేలా ఉండకూడదని హితువు పలికారు.

Advertisement