అక్షరటుడే, వెబ్డెస్క్: China | అమెరికా బెదిరింపులకు US threats దీటుగా నిలుస్తున్న చైనా ఆ దేశంతో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్దమైంది. డోనాల్డ్ ట్రంప్ Donald Trump హెచ్చరికలకు భయపడేది లేదని చైనా China స్పష్టం చేసింది. అమెరికాలోకి America వచ్చే చైనా China ఉత్పత్తులపై ట్రంప్ ఇటీవల 34 శాతం టారిఫ్‌లు tariffs పెంచగా, డ్రాగన్ అదే స్థాయిలో ప్రతిస్పందించింది. అమెరికా నుంచి తమ దేశంలోకి వచ్చే ఉత్పత్తులపై అంతే మొత్తంలో సుంకాలు ఉంటాయని తేల్చి చెప్పింది. డ్రాగన్ ప్రకటనల నేపథ్యంలో స్పందించిన ట్రంప్.. ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని, లేకపోతే 50 శాతం సుంకాలు విధిస్తానని హెచ్చరించారు.
China | చూసుకుందామంటున్న చైనా
చైనా దిగుమతులపై China imports అదనంగా 50 శాతం సుంకాలు విధిస్తామనే ట్రంప్ బెదిరింపులను చైనా China తేలిగ్గా తీసుకుంది. మా హక్కులు, ప్రయోజనాలను కాపాడుకునే క్రమంలో వెనక్కు తగ్గబోమని తేల్చి చెప్పింది. “మాపై టారిఫ్‌లు పెంచుతామని అమెరికా America బెదిరించడం తప్పు మీద తప్పు చేయడమే. ఇది ఆ దేశ బ్లాక్ మెయిల్ విధానాలను blackmail policies మరోసారి బహిర్గతం చేసింది. చైనా వీటిని ఏమాత్రం పట్టించుకోదు. తన దారికి రావాలని అమెరికా పట్టుబడితే చివరి వరకు పోరాటం చేస్తాం. మా దేశ సార్వభౌమత్వం, అభివృద్ధి ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని ప్రతఘటన చర్యలు తీసుకుంటామని” చైనా China స్పష్టం చేసింది. అదే సమయంలో ఏ వివాదమైనా చర్చలతోనే పరిష్కరించుకోవచ్చని, అందుకు తాము ఎప్పుడూ సిద్ధమేనని తెలిపింది. అదే సమయంలో తమ దేశ ప్రయోజనాల విషయంలో రాజీ పడబోమని చెప్పింది.