అక్షరటుడే, వెబ్డెస్క్ : చైనా- అమెరికా మధ్య ట్రేడ్ వార్లో విజేతలు ఉండరని చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ పేర్కొన్నారు. చైనా వస్తువులపై సుంకాలు విధిస్తానని అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్న విషయం తెలిసిందే. దీనిపై ఆయన స్పందిస్తూ ‘టారిఫ్ వార్ ట్రేడ్ వార్, టెక్నాలజీ వార్ అనేవి చారిత్రక పోకడలకు, ఆర్థిక చట్టాలకు విరుద్ధంగా నడుస్తాయి. వీటిలో విజేతలు ఉండరని‘ వ్యాఖ్యానించారు. తమ దేశ ప్రయోజనాలను పరిరక్షించుకుంటామని చైనా అధ్యక్షుడు స్పష్టం చేశారు.