chiranjeevi | నెట్టింట చ‌క్క‌ర్లు కొడుతున్న చిరంజీవి టెన్త్ మెమో.. చూసి మురిసిపోతున్న ఫ్యాన్స్

chiranjeevi | నెట్టింట చ‌క్క‌ర్లు కొడుతున్న చిరంజీవి టెన్త్ మెమో.. చూసి మురిసిపోతున్న ఫ్యాన్స్
chiranjeevi | నెట్టింట చ‌క్క‌ర్లు కొడుతున్న చిరంజీవి టెన్త్ మెమో.. చూసి మురిసిపోతున్న ఫ్యాన్స్
Advertisement

అక్షరటుడే, వెబ్​డెస్క్​: chiranjeevi | మెగాస్టార్ చిరంజీవి.. ఈ పేరు చెబితే అభిమానులు పూన‌కంతో ఊగిపోతుంటారు. ఆయ‌న డ్యాన్స్‌లు, ఫైట్స్, ప‌ర్‌ఫార్మెన్స్ చూసి ఫిదా కాని వారు లేరంటే అతిశ‌యోక్తి కాదు.

స్వయం కృషితో సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న చిరంజీవి ఎంతో మందికి లిఫ్ట్ కూడా ఇచ్చాడు. ఆయ‌న సినిమాల‌తోనే కాదు సేవా కార్య‌క్ర‌మాల‌తోనూ ఎంతో మంది ప్రేక్ష‌కుల మ‌న‌స్సుల్లో చెర‌గ‌ని ముద్ర వేసుకున్నారు. ఆరు పదుల వయసులో కూడా చిరు ఎనర్జీ లెవెల్స్ చూసి మెగా ఫ్యాన్స్ తెగ మురిసిపోతుంటారు. రీఎంట్రీ త‌ర్వాత చిరు సినిమాలు కాస్త నిరాశ ప‌రుస్తున్నా కూడా ఆయ‌న ఏదో రోజు అద‌రిపోయే హిట్ కొడ‌తాడ‌ని ఫ్యాన్స్ ఈగ‌ర్‌గా వెయిట్ చేస్తున్నారు.

chiranjeevi | మెమో వైర‌ల్..

ప్ర‌స్తుతం చిరంజీవి, వశిష్ట కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం విశ్వంభర.ఈ సినిమా పాట చిత్రీకరణ ప్రస్తుతం హేలో నేటివ్ స్టూడియోలో జరుగుతుంది. ఈ సినిమాతో చిరు త‌ప్ప‌క హిట్ కొడ‌తాడ‌ని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. అయితే చిరంజీవికి సంబంధించి నిత్యం నెట్టింట ఏదో ఒక వార్త హ‌ల్‌చ‌ల్ చేస్తూనే ఉంటుంది. తాజాగా చిరంజీవి టెన్త్ మెమో ఒక‌టి వైర‌ల్ అవుతుంది. జ‌న‌ర‌ల్‌గా చిరంజీవి ప‌దో తరగతిలో ఎన్ని మార్కులు సాధించారనే విషయం అందరిలో ఆసక్తిని కలిగిస్తోంది. సినీ రంగంలో మెగాస్టార్‌గా ఓ వెలుగు వెలుగుతున్న చిరంజీవి చదువులో ఎలాంటి ప్రతిభ కనబరిచారో తెలుసుకోవాలని ప్రతి అభిమానికి ఉంటుంది. ఈ క్ర‌మంలో ఆయ‌న టెన్త్ మెమో చూసి అవాక్క‌వుతున్నారు.

ఇది కూడా చ‌ద‌వండి :  Chiranjeevi : చిరంజీవి బర్త్ డే కానుకగా విశ్వంభర.. రిలీజ్ క్లారిటీ వచ్చేది ఎప్పుడు..?

అందులో 1955 ఆగస్టు 22వ తేదీన చిరంజీవి జ‌న్మించిన‌ట్టు ఉంది. ఇందులో ఆయన పేరు ‘కేఎస్ఎస్ వరప్రసాద్ రావు’గా ఉండగా, తండ్రి పేరు వెంకట్‌రావు అని రాసి ఉంది. ఆయన పెనుగొండలో జన్మించినట్టు ఈ సర్టిఫికేట్ ద్వారా అర్ధ‌మ‌వుతుంది. అయితే, అందులో ఆయన పదో తరగతిలో పొందిన మార్కులు మాత్రం కనిపించలేదు. ఇక చిరు 1978లో వచ్చిన పునాదిరాళ్ళు చిత్రంతో చిరంజీవి నటజీవితం ప్రారంభమైంది. కానీ అంతకుముందే ప్రాణం ఖరీదు సినిమా విడుదలైంది.

Advertisement