Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర సినిమా చేస్తున్నారు. ఆ సినిమాను వశిష్ట డైరెక్ట్ చేస్తున్నారు. యువి క్రియేషన్స్ బ్యానర్ లో భారీ బడ్జెట్ లో ఆ సినిమా తెరకెక్కుతుంది. ఐతే ఈ సినిమాలో ఇప్పటికే త్రిష, మీనాక్షి చౌదరి, ఆషిక రంగనాథ్ హీరోయిన్స్ గా నటిస్తుండగా లేటెస్ట్ గా మరో హీరోయిన్ కూడా జాయిన్ అయినట్టు తెలుస్తుంది.
విశ్వంభర సెట్స్ నుంచి లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ ఫోటోలో చిరంజీవితో పాటు శ్రీలీల కూడా ఉంది. చిరంజీవి విశ్వంభర సెట్ లో ఉన్నారు. సో ఇలా చూస్తే శ్రీలీల కూడా విశ్వంభర సినిమాలో నటిస్తుందా అనే డౌట్స్ రేజ్ అవుతున్నాయి. విశ్వంభర సినిమా ఒక సైన్స్ ఫిక్షనల్ సినిమాగా రాబోతుంది. చిరంజీవి శ్రీలీలకు అమ్మవారున్న శంఖాన్ని కానుకగా ఇచ్చారు.
మరి ఈ ఫోటోలు చూసిన ఫ్యాన్స్ విశంభర సినిమాలో శ్రీలీల కూడా నటిస్తుందా అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరి ఆ సినిమాలో శ్రీలీల ఉందా లేదా అన్నది తెలియదు కానీ అమ్మడు మాత్రం ఉంటే నెక్స్ట్ లెవెల్ అనేలా ఉంటుంది. విశ్వంభర సినిమా వెరైటీ సబ్జెక్ట్ తో వస్తుందని తెలుస్తుంది. ఈ సినిమాకు కీరవాణి మ్యూజిక్ స్పెషల్ ఎట్రాక్షన్ కానుంది.
చిరంజీవి శ్రీలీల ఇద్దరు కలిసి డ్యాన్స్ చేస్తే అదిరిపోతుంది. చిరంజీవి నెక్స్ట్ సినిమా అనిల్ రావిపూడి తో చేస్తున్నాడు. ఆ సినిమా ఈ ఇయర్ సెకండ్ హాఫ్ లో సెత్స్ మీదకు వెళ్తుందని తెలుస్తుంది. అనిల్ రావిపూడి సినిమాను మాత్రం 3 నెలల్లో పూర్తి చేసి 2026 సంక్రాంతికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. చిరంజీవి జగదేక వీరుడు అతిలోక సుందరి తరహాలోనే ఈ సినిమా ఉంటుందని అంటున్నారు. మరి సినిమా నుంచి ఏదైనా పోస్టర్ వస్తేనే అసలు విషయం ఏంటన్నది తెలుస్తుంది. ఈ సినిమాలో చాలా సర్ ప్రైజ్ లు ఉన్నాయని చెబుతుంటే ఏమో అనుకున్నాం కానీ శ్రీలీలతో చిరు స్టెప్పేస్తే మాత్రం థియేటర్ ఊగిపోతుందని చెప్పొచ్చు.