నగర శివారులో చిరుత కలకలం

0

అక్షరటుడే, నిజామాబాద్‌అర్బన్‌: నగరంలోని కంఠేశ్వర్‌లో గల ఎంఎస్‌ఆర్‌ కళాశాల సమీపంలో చిరుత వచ్చిందనే ప్రచారం కలకలం రేపింది. ఈ ప్రాంతంలోకి ఓ జంతువు రావడంతో స్థానికులు చిరుతగా భావించి గురువారం ఉదయం ఫారెస్ట్‌ అధికారులకు సమాచారమిచ్చారు. దీంతో అధికారులు వెంటనే వచ్చి పాదముద్రలను పరిశీలించారు. అవి చిరుత పాదముద్రలు కావని అధికారులు తేల్చారు. ఈ ప్రాంతంలో చిరుతల సంచారం లేదని, ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని రేంజ్ అధికారి పద్మారావు తెలిపారు.