అక్షర టుడే, వెబ్ డెస్క్ Chris Gayle : యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ (Chris Gayle) గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఆయన స్టేడియంలో ఎంత విధ్వంసం సృష్టిస్తాడో బయట కూడా అంత హంగామా చేస్తుంటాడు. క్రికెట్‌కి దూరమైన తర్వాత గేల్ తెగ సందడి చేస్తున్నాడు. సోషల్ మీడియాలో (Social media) యాక్టివ్‌గా ఉండే గేల్ (Chris Gayle) తాజాగా క్రేజీ వీడియో ఒకటి షేర్ చేశాడు. ఇందులో బీచ్‌లో ల్యాప్‌టాప్ ఉపయోగిస్తున్న ఒక ఫన్నీ వీడియోని షేర్ చేశాడు. ఈ వీడియోలో అతను బీచ్‌లో కూర్చుని, చేతిలో ల్యాప్‌టాప్ పట్టుకుని, “నేను ఈ రోజు పని చేయడం లేదు” అనే క్యాప్షన్‌తో షేర్ చేశాడు.
Chris Gayle : గేల్ సందడి..
ఈ వీడియో చాలా మంది దృష్టిని ఆకర్షించింది, అభిమానులు మరియు తోటి క్రికెటర్లు ఈ పోస్ట్‌పై ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఆస్ట్రేలియన్ లెజెండ్ బ్రెట్ లీ (Australian legend Brett Lee) కూడా నవ్వుతున్న ఎమోజితో “నెట్‌లో సర్ఫింగ్ చేస్తున్నారా?” అని కామెంట్ చేశాడు. ఓ నెటిజన్ అయితే గేల్ తన ల్యాప్‌టాప్‌లో ఇండియన్ టీవీ సిరీస్‌లు చూస్తున్నట్టున్నాడు అని కామెంట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. ‘ది యూనివర్స్ బాస్’ ఇటీవల ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ (IML)లో వెస్టిండీస్ మాస్టర్స్ తరపున ఆడాడు. 463 T20 మ్యాచ్‌ల్లో 1056 సిక్సర్లతో గేల్ అత్యధిక T20 మరియు IPL సిక్సర్ల రికార్డును కలిగి ఉన్నాడు. వెస్టిండీస్ లెజెండ్ IPLలో అత్యధిక సిక్సర్లు బాదాడు, 142 మ్యాచ్‌ల్లో 357 సిక్సర్లు కొట్టాడు.
యూనివర్స్ కింగ్ క్రిస్ గేల్ (Universe King Chris Gayle) ప్రపంచంలో జరిగే ప్రతీ టీ20 లీగ్‌లోనూ కనిపిస్తాడు. ప్రతి టోర్నీలోనూ సిక్స్‌ల వర్షం కురిపిస్తూ.. ఎక్కువ సంఖ్యలో సిక్స్‌లు బాదాడు. ఇంకెవరికీ సాధ్యం కాని రికార్డులు సృష్టించాడు. టీ20 క్రికెట్‌లో క్రిస్ గేల్ ఇప్పటి వరకు 1001 సిక్స్‌లు బాదాడు. వెయ్యికి పైగా సిక్స్‌లు కొట్టిన ఏకైక క్రికెటర్ క్రిస్ గేల్ (Chris Gayle) మాత్రమే. మరెవరూ ఇతడి దరిదాపుల్లో కూడా లేరు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore) జట్టు తరపున క్రిస్ గేల్ 263 సిక్స్‌లు కొట్టాడు. ఒక జట్టు తరపున ఇన్ని సిక్స్‌లు కొట్టడం ఓ రికార్డు.
View this post on Instagram