అక్షరటుడే, వెబ్‌డెస్క్: Nag Ashwin | మహానటి సినిమాతో Mahanati movie అందరి దృష్టిని ఆకర్షించిన టాలీవుడ్ దర్శకుడు నాగ్ అశ్విన్ Tollywood director Nag Ashwin. ఈ సినిమా తర్వాత ప్రభాస్ ప్రధాన పాత్రలో కల్కి అనే చిత్రాన్ని movie Kalki తెరకెక్కించి టాప్ డైరెక్టర్స్‌లో ఒకరిగా పేరు తెచ్చుకున్నాడు. అయితే నాగ్ అశ్విన్ Nag Ashwin.. ఇటీవల కొందరు కళాశాల విద్యార్థులతో college students ముచ్చటిస్తూ, సినీ పరిశ్రమలో film industry తన ప్రయాణం, అనుభవాలు, అభిప్రాయాల గురించి పంచుకున్నారు. మహేష్ బాబు Mahesh Babu నటించిన ‘ఖలేజా’, విజయ్ దేవరకొండ Vijay Deverakonda నటించిన ‘డియర్ కామ్రేడ్’ చిత్రాల విషయంలో తన అభిప్రాయాన్ని పంచుకుంటూ, ఆ సినిమాలకు తాను ఎడిటింగ్ చేసి ఉంటే బాగుండేదని అనిపించినట్లు పేర్కొన్నారు. అయితే, వేరే దర్శకుల సినిమాలను తాను డైరెక్ట్ చేసి ఉంటే బాగుండేదని మాత్రం ఎప్పుడూ అనిపించలేదని స్పష్టం చేశారు.
Nag Ashwin | నిద్ర పట్టలేదు..
ఈ చిట్ చాట్‌లో chit chat నాగ్ అశ్విన్ తన జీవితంలో ఒకసారి తీవ్ర డిప్రెషన్‌లోకి వెళ్లిన విషయాన్ని వెల్లడించారు. 2008లో తాను జ్ఞాపకాల అంశంతో ఒక కథ రాసుకున్నానని, రెండేళ్ల తర్వాత అదే కాన్సెప్ట్‌తో హాలీవుడ్ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ director Christopher Nolan తెరకెక్కించిన ‘ఇన్సెప్షన్’ సినిమా ట్రైలర్ trailer చూసి చాలా డిప్రెషన్‌లోకి depression వెళ్లినట్టు తెలియజేశారు. ‘ఇన్సెప్షన్’ inception ట్రైలర్ చూసిన తర్వాత వారం రోజుల పాటు డిప్రెషన్‌లో ఉన్నాను. నా కథ జ్ఞాపకాల ఆధారంగా ఉంటే, ‘ఇన్సెప్షన్’ కలల అంశంతో రూపొందింది. ఈ రెండు కాన్సెప్ట్‌లు దాదాపు సమానంగా ఉండటం నన్ను ఎంతగానో ప్రభావితం చేశాయి. అప్పుడు నేను చాలా కుంగిపోయానంటూ నాగ్ అశ్విన్ స్పష్టం చేశారు.
నాగ్ అశ్విన్ Nag Ashwin ఈ చర్చలో తన సినీ ప్రయాణం, వ్యక్తిగత అనుభవాలను personal experiences ఓపెన్‌గా పంచుకోవడం విద్యార్థులను ఆకట్టుకుంది. ‘కల్కి 2898 AD’తో అంతర్జాతీయ స్థాయిలో international recognition గుర్తింపు పొందిన ఈ దర్శకుడు director, సీక్వెల్‌తో మరిన్ని అద్భుతాలు సృష్టించేందుకు సన్నద్ధమవుతున్నారు. ప్రస్తుతం కల్కి 2 సీక్వెల్ పనులు కొనసాగుతున్నప్పటికీ, ప్రభాస్ ఇతర చిత్రాలతో బిజీగా ఉండటంతో.. తన పర్సనల్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు నాగ్ అశ్విన్. ఈ క్రమంలో కాలేజ్ విద్యార్ధులతో చిట్ చాట్ చేశాడు.