అక్షరటుడే, ఇందూరు: నగరంలోని సీఎస్‌ఐ చర్చిలో ఆదివారం క్రిస్మస్ ఉత్సవాల సందర్భంగా పలువురిని చర్చి కమిటీ సభ్యులు సన్మానించారు. మాజీ మంత్రి వేణుగోపాలచారి, నుడా ఛైర్మన్ కేశ వేణు, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు నరాల రత్నాకర్‌ను వారు సత్కరించారు. అనంతరం పాస్టర్లు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కార్యక్రమంలో రెవ జార్జ్ ప్రెసిబిటర్, ఇన్‌చార్జి రెవ ప్రకాశ్, రెవ కృపాకర్, కార్యదర్శి సుధీర్, కిట్టు తదితరులు పాల్గొన్నారు.