ACB Case Bhadrachalm | ఏసీబీకి చిక్కిన సీఐ, కానిస్టేబుల్​

ACB Case | ఏసీబీకి చిక్కిన సీఐ, కానిస్టేబుల్​
ACB Case | ఏసీబీకి చిక్కిన సీఐ, కానిస్టేబుల్​

అక్షరటుడే, వెబ్​డెస్క్ : ACB Case | లంచం తీసుకున్న ఓ సీఐ(CI), కానిస్టేబుల్​పై ఏసీబీ(ACB) అధికారులు కేసు నమోదు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం (Badrachalam) ఎస్​హెచ్​వో SHO రమేశ్ తో పాటు కానిస్టేబుల్ రామారావు ఏసీబీకి చిక్కారు. 

Advertisement

​తనిఖీల్లో భాగంగా కంకర రవాణా చేస్తున్న వాహనాన్ని పట్టుకున్నారు. అయితే ఎలాంటి కేసు నమోదు చేయకుండా వాహనాన్ని వదిలి పెట్టడానికి రూ.30 వేల లంచం డిమాండ్​ చేశారు. వాహన యజమాని బతిమిలాడటంతో రూ.20 వేలకు ఒప్పుకున్నారు. ఈ క్రమంలో ఫోన్​ పే ద్వారా రూ.20 వేలు పంపిన తర్వాత వాహనాన్ని వదిలేశారు. అయితే బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో లంచం తీసుకున్న ఎస్​హెచ్​వో రమేశ్​, కానిస్టేబుల్​ సీహెచ్​ రామారావు, ప్రైవేట్​ వ్యక్తి కార్తీక్​పై కేసు నమోదు చేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.

Advertisement