అక్షరటుడే,కోటగిరి : పోతంగల్ మండలంలోని మంజీర వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ ను సీఐ జేయేష్ రెడ్డి మంగళవారం తనిఖీ చేశారు. తెలంగాణ – మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతం కావడంతో ఎలాంటి అక్రమ రవాణా జరగకుండా పోలీస్, రెవెన్యూ, ఎక్సైజ్, వ్యవసాయ శాఖ అధికారులు తనిఖీలు చేస్తున్నారని తెలిపారు.