అక్షర టుడే, ఆర్మూర్: పట్టణ పరిధిలోని పెర్కిట్ సంతోష్ ఫ్యామిలీ దాబా ప్రాంతంలో బుధవారం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు సీఐ సత్యనారాయణ గౌడ్ తెలిపారు. ఈ మేరకు మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రిలోని పోస్టుమార్టం గదిలో భద్రపరిచినట్లు పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు