అక్షరటుడే, వెబ్ డెస్క్: పార్లమెంట్ ఎన్నికల వేళ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. 2019లో ఆమోదం పొందిన సీఏఏ(సిటిజెన్షిప్ అమెండ్మెన్ట్ యాక్ట్)ను అమల్లోకి తెచ్చింది. ఈ మేరకు కేంద్ర హోం శాఖ సోమవారం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. 2019 డిసెంబర్ 11న బిల్లు ఆమోదం పొందగా.. విధివిధానాలను రూపొందించిన అనంతరం అమల్లోకి తెచ్చింది. 2014 డిసెంబర్ 31 కంటే ముందు దేశానికి వచ్చిన ముస్లిమేతరులకు భారత పౌరసత్వం లభించనుంది. పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్గనిస్తాన్ దేశాల్లో హింసకు గురై గతంలో అనేక మంది శరణార్థులుగా భారత్ కు వచ్చి ఉంటున్నారు. వీరిలో అర్హులైన వారిని గుర్తించి దేశ పౌరసత్వం కల్పించనున్నారు.