అక్షరటుడే, ఆర్మూర్ : ఆర్మూర్ బాలికల ఉన్నత పాఠశాలలో విధుల్లో నుంచి తొలగించిన మధ్యాహ్న భోజన కార్మికులను తిరిగి తీసుకోవాలని నాయకులు డిమాండ్ చేశారు. సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ.. కార్మికులను విధుల్లోకి తీసుకోకపోతే జిల్లావ్యాప్తంగా సోమవారం మధ్యాహ్న భోజనం బంద్ పెడతామన్నారు. ఈ మేరకు మధ్యాహ్నం భోజన కార్మిక సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కొండా గంగాధర్ శనివారం డీఈవో అశోక్‌కు నోటీసు అందజేశారు. డీఈవో చొరవ తీసుకొని సమస్య పరిష్కరించాలని కోరారు.