అక్షరటుడే, ఇందూరు:Padmasali Sangham | నగర పద్మశాలి సంఘం ఎన్నికలు(Padmasali Sangam nizamabad Elections) మే 25న నిర్వహించనున్నారు. ఈ మేరకు సంఘం అధ్యక్షుడు గుజ్జేటి వెంకట్ నర్సయ్య(President Gujjeti Venkat Narsaiah) పేర్కొన్నారు.
ఇటీవల నగర పద్మశాలి సంఘ భవనంలో నిర్వహించిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అనంతరం వెంకట్ నర్సయ్య మాట్లాడుతూ.. నగరంలోని 68 తర్పల సభ్యులు ఎన్నికల్లో పాల్గొనాలని కోరారు. సమావేశంలో జిల్లా సంఘం గౌరవ అధ్యక్షుడు శ్రీ దీకొండ యాదగిరి, సంఘ పెద్దలు బిజ్జు దత్తాద్రి, పుల్గం హన్మాండ్లు, దాసరి నర్సింలు, హరిదాస్ తదితరులు పాల్గొన్నారు.