అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : నగర మేయర్ నీతూకిరణ్ భర్త శేఖర్‌పై దాడి చేసిన నిందితుడు షేక్ రసూల్ ను పోలీసులు రిమాండ్ చేశారు. సోమవారం సాయంత్రం రసూల్ అనే వ్యక్తి దండు శేఖర్‌పై దాడి చేసిన విషయం తెలిసిందే. నిందితుడిని పట్టుకోడానికి నాలుగు బృందాలు ఏర్పాటు చేసిన పోలీసులు సోమవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం జిల్లా జనరల్ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం మేజిస్ట్రేట్ ఎదుట హాజరు పరిచారు. నిందితుడికి 14 రోజుల రిమాండ్ విధించగా.. నిజామాబాద్ సెంట్రల్ జైలుకు తరలించారు.