అక్షరటుడే, కామారెడ్డి: రాష్ట్రంలో పండించే బియ్యానికి మంచి పేరుందని, ఆ బియ్యాన్ని రాష్ట్రంలోని నిరుపేద కుటుంబాలకే పంపిణీ చేస్తామని సివిల్‌ సప్లయ్‌ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ డీఎస్‌ చౌహాన్‌ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో రైస్‌ మిల్లర్లు, సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇతక రాష్ట్రాలకు కూడా మన ధాన్యం సరఫరా అవుతోందన్నారు. మిల్లర్లకు వారి గత సీఎంఆర్‌ పనితీరు ఆధారంగా ధాన్యం కేటాయింపులు ఉంటాయన్నారు. అనంతరం సదాశివనగర్‌, భిక్కనూరు మండలం జంగంపల్లిలో కేంద్రాలను పరిశీలించారు. కార్యక్రమంలో కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌, ఎస్పీ సింధుశర్మ, అధికారులు పాల్గొన్నారు.