అక్షరటుడే, బాన్సువాడ: వర్ని మండల కేంద్రంలో అధికార పార్టీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. బుధవారం రాత్రి కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ ఛార్జి ఏనుగు రవీందర్ రెడ్డి వర్గం నాయకులపై ఎమ్మెల్యే వర్గం నాయకులు, కార్యకర్తలు దాడులకు పాల్పడ్డారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు భీమశంకర్, అతని ఎనిమిదేళ్ల కొడుకుపై వర్నికి చెందిన మాజీ ఏఎంసీ వైస్ ఛైర్మన్ కొడుకులతో పాటు శ్రీనగర్, నెహ్రూనగర్ గ్రామాలకు చెందిన కొందరు కార్యకర్తలు దాడి చేశారు. ఈ విషయమై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడానికి వెళ్లగా అక్కడ కూడా వారిపై దాడికి దిగారు.