బీఆర్‌ఎస్‌, బీజేపీ నేతల మధ్య తోపులాట

0

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: జనగామ జిల్లా పెందుర్తి వద్ద ఉద్రిక్తత నెలకొంది. బీజేపీలో చేరేందుకు సిద్ధమమైన బీఆర్‌ఎస్‌ నేత, వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్‌ను బుజ్జగించేందుకు ఎర్రబెల్లి దయాకర్‌ రావు బుధవారం తన వాహనంలో హరీశ్‌రావు వద్దకు తీసుకెళ్తుండగా పెందుర్తి వద్ద బీజేపీ నాయకులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్‌, బీజేపీ నాయకుల మధ్య తోపులాట జరిగింది. ఇరు వర్గాల తోపులాటలో ఆరూరి రమేశ్ చొక్కా చిరిగిపోయింది. అనంతరం బీజేపీ శ్రేణులు ఆరూరి రమేష్ ను వారి వాహనంలో ఎక్కించుకుని వెళ్లారు. పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి వద్దకు తీసుకెళ్లిన్నట్లు సమాచారం.