అక్షరటుడే, వెబ్‌డెస్క్: ఢిల్లీలో డిసెంబర్ 1వ తేదీ వరకు పటాకులు కాల్చడాన్ని నిషేధిస్తూ సీఎం అతిషి సోమవారం మధ్యాహ్నం ఆదేశాలు జారీ చేశారు. అక్టోబర్‌లోనే ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 221గా నమోదవ్వడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీపావళికి వాయికాలుష్యం మరింత పెరిగే అవకాశమున్నందున పటాకులు కాల్చడాన్ని నిషేధించారు.