అక్షరటుడే, వెబ్‌డెస్క్‌ : ఢిల్లీలో శాంతి భద్రతలను కాపాడే బాధ్యత కేంద్రానిదే అని సీఎం అతిషి స్పష్టం చేశారు. ఢిల్లీలో ఆదివారం సీఆర్‌పీఎఫ్‌ పబ్లిక్‌ స్కూల్‌ వెలుపల పేలుడు సంభవించిన ఘటన కలకలం రేపింది.ఈ ఘటనపై సీఎం అతిషి స్పందిస్తూ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. పోలీసులు, ల్యాండ్‌, శాంతి భద్రతల బాధ్యత కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటుందన్నారు. నిన్న ఓ చోట 60 గన్‌షాట్ల శబ్దాలు వినిపించాయని.., ఈరోజు రోహిణి ఏరియాలో పేలుడు సంభవించిందని మీడియా సమావేశంలో ఆమె తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తన 90 శాతం శక్తిని కేవలం ఢిల్లీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి ఉపయోగిస్తున్నదని విమర్శించారు.