అక్షర టుడే, వెబ్డెస్క్ : తిరుమలలో ఇక నుంచి వీఐపీ బ్రేక్ దర్శనాలపై పరిమితి విధిస్తామని, దేశం నలుమూలాల నుంచి వచ్చే సాధారణ భక్తులకు ప్రాముఖ్యత ఇవ్వాలని టీటీడీ అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు. భక్తుల సూచనల మేరకే చర్యలు చేపడుతామని తెలిపారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా సీఎం చంద్రబాబు దంపతులు శుక్రవారం స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఇవాళ ఉదయం వకుళా మాత వంటశాలను ఆయన ప్రారంభించారు. అనంతరం బ్రహోత్సవాల ఏర్పాట్లపై సీఎం టీటీడీ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతు తిరుమల పవిత్రతను కాపాడుతామని భక్తులకు హామీ ఇస్తున్నానని స్పష్టం చేశారు. శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని డూప్లికేట్ చేయలేకపోయారని.. ఆరుచి రావడం అసాధ్యమని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శ్రీవారి ప్రసాదాలు, పరిశుభ్రతలో చాలా మార్పులు వచ్చాయన్నారు. శ్రీవారిని తలుచుకొని ఏపని మొదలు పెట్టినా.. విజయవంతం అవుతుందనే నమ్మకం భక్తులతో పాటు తనలోను ఉందని తెలిపారు.