CM Chandrababu : అంగ‌న్‌వాడీ ఉద్యోగుల‌కు తీపి క‌బురు చెప్పిన చంద్ర‌బాబు.. మ‌హిళ‌లు ఫుల్ ఖుష్‌

Advertisement

అక్ష‌ర‌టుడే, వెబ్‌డెస్క్‌ CM Chandrababu : మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్భంగా ఏపీ సీఎం చంద్ర‌బాబు మ‌హిళ‌ల‌కు తీపి క‌బురు చెప్పారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోష‌ల్ మీడియా ద్వారా శుభాకాంక్షలను తెలియజేశారు. అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం మహిళల కోసం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు, పథకాల గురించి వివరించారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి మహిళా సాధికారత కోసమే పనిచేస్తోందని చంద్రబాబు ఈ సంద‌ర్భంగా తెలియ‌జేశారు.

CM Chandrababu : శుభవార్త‌..

తెలుగింటి ఆడపడుచులు, మాతృసమానులైన మహిళామణులకు శుభాకాంక్షలు చెబుతున్నానంటూ ట్వీట్ పోస్ట్ పెట్టారాయన. మహిళా దినోత్సవం జరుపుకోవడం ఆనవాయితీ కాదని, ఇది సమాజ బాధ్యతగా అభివర్ణించారు. మహిళలకు ఆస్తిలో వాటా కల్పించడం నుంచి విద్య, ఉద్యోగాలు, రాజకీయాల్లో రిజర్వేషన్లు కల్పించడం వరకు మహిళాభ్యుదయ కార్యక్రమాలు ఎన్నో కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను అమలు చేసి అద్భుత ఫలితాలను సాధించిన విషయం తెలిసిందేనని చంద్రబాబు అన్నారు.

ఇది కూడా చ‌ద‌వండి :  Women's Day | నారీ.. నీకు వందనం..

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి మహిళా సాధికారత కోసమే పనిచేస్తోందన్నారు. మహిళలకు ఆస్తిలో వాటా కల్పించడం నుంచి విద్య, ఉద్యోగాల్లో, రాజకీయాల్లో రిజర్వేషన్లు కల్పించడం వరకు మహిళాభ్యుదయ కార్యక్రమాలు ఎన్నో చేసి ఫలితాలను సాధించింది చంద్ర‌బాబు పేర్కొన్నారు. అంతేకాక అంగ‌న్ వాడీ వ‌ర్క‌ర్ల‌కి, హెల్ప‌ర్స్‌కి సీఎం చంద్ర‌బాబు గుడ్ న్యూస్ అందించారు. అంగ‌న్ వాడీ మెయిన్ మినీ వ‌ర్క‌ర్స్‌కి, ల‌క్ష హెల్ప‌ర్ల‌కి రూ.40 వేల చొప్పున స‌ర్వీస్ ముగిసిన స‌మ‌యంలో ఇవ్వనుంద‌ని ఆయ‌న తెలియ‌జేశారు. చంద్ర‌బాబు ఇచ్చిన ఈ శుభ‌వార్త‌తో మ‌హిళ‌లు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు.

Advertisement