అక్షరటుడే, వెబ్‌డెస్క్‌ : లిక్కర్‌ వ్యాపారంలో టీడీపీ ప్రజాప్రతినిధులు ఎవరూ జోక్యం చేసుకోవద్దని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. శుక్రవారం పార్టీ నేతల సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీ అధికారంలోకి రావడానికి కార్యకర్తలు ఎంతో శ్రమించారని, త్యాగాలు చేశారని గుర్తు చేశారు. తప్పు చేసిన ఎవర్నీ వదిలిపెట్టమని వార్నింగ్‌ ఇచ్చారు. మనం కక్ష సాధింపు చర్యలకు దిగితే వైసీపీకి మనకి తేడా లేదనుకుంటారని పేర్కొన్నారు. అలాగే ఎన్డీఏలో ఉన్న ఏ కార్యకర్త తప్పు చేసినా.. ఎవరినైనా తిట్టినా సీఎంతో పాటు ప్రభుత్వంపై కూడా ఆ ప్రభావం ఉంటుందన్నారు. మద్యం వ్యాపారాలకు దూరంగా ఉండాలని పార్టీ నేతలను సీఎం ఆదేశించారు.