CM Revanth Reddy | తోడ్కలు​ తీస్తా.. వారికి సీఎం సీరియస్​ వార్నింగ్​

CM Revanth Reddy | తోడ్కాల్​ తీస్తా.. వారికి సీఎం సీరియస్​ వార్నింగ్​
CM Revanth Reddy | తోడ్కాల్​ తీస్తా.. వారికి సీఎం సీరియస్​ వార్నింగ్​
Advertisement

అక్షరటుడే, వెబ్​డెస్క్​ : CM Revanth Reddy | యూ ట్యూబ్(Youtube)​ ఛానెళ్ల పేరిట తమను, తమ కుటుంబ సభ్యులను తిట్టి వారికి సీఎం రేవంత్​రెడ్డి(CM Revanth Reddy) వార్నింగ్​ ఇచ్చారు. వారు తీరు మార్చుకోకపోతే తోడ్కలు​ తీస్తానని హెచ్చరించారు. బడ్జెట్​ సమావేశాల్లో భాగంగా శనివారం ఆయన మాట్లాడారు. కొందరు జర్నలిస్టుల(Journalists) పేరిట ఇష్టం వచ్చినట్లు వీడియోలు తీసి యూట్యూబ్​లో పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ఇంట్లో ఆడవాళ్లని తిట్టిస్తూ వీడియోలు పెడితే తమకు కోపం రాదా అని ప్రశ్నించారు.

Advertisement

CM Revanth Reddy | ప్రజా జీవితంలో ఉన్నందుకే..

ప్రజా జీవితంలో ఉన్నందుకే ఓపిక పడుతున్నామని సీఎం రేవంత్​రెడ్డి అన్నారు. తమ తల్లిని, భార్యను తిడుతూ వీడియోలు పెడుతున్నారని మండిపడ్డారు. అలాంటి వారిని వదిలి పెట్టమని స్పష్టం చేశారు. తోడ్కలు తీస్తామని, బట్టలుడదీసి రోడ్డు మీద తిప్పిస్తానని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాగా ఇటీవల రేవంత్​రెడ్డిని తిట్టిన వీడియో పోస్టు చేసిన జర్నలిస్ట్​ రేవతి(Revathi)ని పోలీసులు అరెస్ట్(Arrest)​ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కొందరు అరెస్టును ఖండించారు. దీంతో సీఎం స్పందించారు. అరెస్టును ఖండించే వారు.. వారి కుటుంబ సభ్యులను తిడితే ఊరుకుంటారా అని సీఎం ప్రశ్నించారు.

ఇది కూడా చ‌ద‌వండి :  Budget Session | రేపటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

CM Revanth Reddy | ముసుగు తీసి కొడతాం..

జర్నలిస్ట్​ సంఘాల(Journalist Unions) నాయకులు జర్నలిస్టుల లిస్ట్​ ఇవ్వాలని రేవంత్​రెడ్డి సూచించారు. ఆ లిస్ట్​లో ఉన్న వారు తప్పు చేస్తే ఎలా శిక్షించాలో కూడా నిర్ణయించాలని ఆయన అన్నారు. అలాగే ఆ లిస్ట్​లో లేకుండా జర్నలిస్టులమని చెప్పుకునే వారిని తాము క్రిమినల్స్​ కింద పరిగణిస్తామని సీఎం స్పష్టం చేశారు. వారికి ఎలా జవాబు చెప్పాలో తమకు తెలుసన్నారు. ముసుగు వేసుకొని వస్తే ముసుగు తీసి కొడతామన్నారు. తనకు పౌరుషం ఉందని, అలాంటి వారిపై చట్టపరంగానే కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి హెచ్చరించారు.