Pastor Praveen | రోడ్డు ప్రమాదమా.. హత్య : పాస్టర్​ ప్రవీణ్​ మృతిపై విచారణకు సీఎం ఆదేశం

Pastor Praveen | రోడ్డు ప్రమాదమా.. హత్య : పాస్టర్​ ప్రవీణ్​ మృతిపై విచారణకు సీఎం ఆదేశం
Pastor Praveen | రోడ్డు ప్రమాదమా.. హత్య : పాస్టర్​ ప్రవీణ్​ మృతిపై విచారణకు సీఎం ఆదేశం

అక్షరటుడే, వెబ్​డెస్క్: హైదరాబాద్​కు చెందిన పాస్టర్​ ప్రవీణ్​ పగడాల మృతిపై క్రిస్టియన్​ సంఘాలు Christian groups అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. సోమవారం రాత్రి ఆయన హైదరాబాద్​ Hyderabad నుంచి బైక్​పై రాజమహేంద్రవరం బయలు దేరారు. మంగళవారం ఉదయం రాజమహేంద్రవరం శివారులోని కొంతమూరు వద్ద రోడ్డు పక్కన ఆయన మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు రోడ్డు ప్రమాదంలో ఆయన మృతి చెందినట్లు తెలిపారు.

Advertisement
Advertisement

Pastor Praveen |  క్రిస్టియన్​ సంఘాల అనుమానం

పాస్టర్​ ప్రవీణ్​ Pastor Praveen రోడ్డు ప్రమాదంలో మృతి చెందలేదని, ఆయన ఒంటిపై గాయాలు లేవని క్రిస్టియన్​ సంఘాలు అంటున్నాయి. ఆయనను ఎవరో హత్య చేశారని ఆరోపిస్తున్నాయి. ప్రవీణ్​ మృతదేహాన్ని పోలీసులు రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రికి Government Hospital తరలించగా స్థానిక క్రైస్తవులు అక్కడకు చేరుకొని ఆందోళన చేపట్టాయి. తమకు న్యాయం చేయాలని డిమాండ్​ చేశాయి. ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్​ Former AP Chief Minister Jagan కూడా ప్రవీణ్​ మృతిపై విచారం వ్యక్తం చేశారు. సమగ్ర దర్యాప్తు జరిపించాలని డిమాండ్​ చేశారు. కేఏ పాల్ కూడా పాస్టర్​ మృతిపై అనుమానాలు వ్యక్తం చేశారు. రాజమండ్రి ఆస్పత్రిలోని పోస్టుమార్టం గదిలోకి వెళ్లడానికి ఆయన యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.

ఇది కూడా చ‌ద‌వండి :  Betting Apps | బెట్టింగ్​ యాప్​ కేసు.. దూకుడు పెంచిన పోలీసులు

Pastor Praveen | ఐదు బృందాల ఏర్పాటు

పాస్టర్​ ప్రవీణ్​ Pastor Praveen మృతిపై సీఎం చంద్రబాబు, హోం మంత్రి అనిత Home Minister Anita స్పందించారు. ఈ విషయంలో సమగ్రంగా దర్యాప్తు చేయాలని ఆదేశించారు. దీంతో అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసిన పోలీసులు police దర్యాప్తు కోసం ఐదు బృందాలను నియమించారు.

Advertisement