CM Revanth reddy | బీఆర్‌ఎస్‌పై సీఎం రేవంత్​ రెడ్డి ఫైర్‌..

CM Revanth reddy | బీఆర్‌ఎస్‌పై సీఎం రేవంత్​ రెడ్డి ఫైర్‌..
CM Revanth reddy | బీఆర్‌ఎస్‌పై సీఎం రేవంత్​ రెడ్డి ఫైర్‌..

అక్షరటుడే, వెబ్​డెస్క్​: CM Revanth reddy | శాసనసభ బడ్జెట్​ సమావేశాలు budget sessions వాడివేడిగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా గురువారం సభలో మాట్లాడిన సీఎం రేవంత్​ రెడ్డి CM Revanth Reddy బీఆర్​ఎస్​ పార్టీపై ఫైర్​ అయ్యారు. గత ప్రభుత్వం రెండు సార్లు చేసిన రుణామాఫీ కంటే అధికంగా తాము ఒకే సారి మాఫీ చేశామని తెలిపారు.

Advertisement
Advertisement

2014 ఎన్నికల్లో బీఆర్​ఎస్​ పార్టీ BRS party ఏకకాలంలో రూ.లక్ష రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. కానీ ఎన్నికలయ్యాక మాఫీ చేసేందుకు ఐదేళ్లు పట్టిందన్నారు. అంతేకాకుండా రెండో సారి కూడా రుణమాఫీ చేస్తామని అధికారంలోకి వచ్చి.. నాలుగేళ్ల వరకు చేయలేదని విమర్శించారు. పదేళ్ల బీఆర్​ఎస్ ప్రభుత్వ BRS government హయాంలో 21 లక్షల మంది రైతులకు రూ.16,908 కోట్లు మాత్రమే రుణమాఫీ చేసిందని గుర్తు చేశారు. కానీ తాము అధికారంలోకి వచ్చాక 25 లక్షల మంది రైతులకు రూ. 20వేల కోట్లు మాఫీ చేశామని తెలిపారు. అంతేకాకుండా రూ. రెండు లక్షల చొప్పున రుణమాఫీ చేశామని చెప్పారు.

Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  Ration Cards | పేదలందరికీ సన్న బియ్యం.. చరిత్రలో నిలిచిపోనున్న పథకం